ఏనుగు హంతకులను దండించాల్సిందే…రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కేరళలో జరిగిన గర్భిణి ఏనుగు హత్యను ఖండిస్తూ ఈ పోస్ట్ పెట్టాడు. మలప్పురంలోని స్థానికులు పేలుడు పదార్థాన్ని పైనాపిల్‌లో పెట్టి ఏనుగుకు ఆహారంగా ఇచ్చారు. ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతున్న ఏనుగు నిజమే అని నమ్మి పైనాపిల్‌ను ఆనందంగా స్వీకరించింది. దీంతో పైనాపిల్ బ్లాస్ట్ అయి నోరంతా కాలుతుంది. ఈ బాధను భరించలేక ఎవరికీ చెప్పలేక ఒక నదిలో నిలబడి నీటిని తాగింది. ఏనుగును గుర్తించిన అధికారులు కాపాడేలోపే ప్రాణాలు విడిచింది. ఏనుగు చావుకు కారణం జ్ఞానవంతులైన మనుషులే. వారి ఆనందం కోసం మూగజీవావాన్ని పొట్టనపెట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే రతన్ టాటా షాక్ అయ్యారు. ఇది మర్డర్‌తో సమానం. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తనదైన శైలిలో ట్విటర్లో పోస్ట్ చేశాడు రతన్.













