గులాం నబీ ఆజాద్ కు బంపర్ ఆఫర్…
రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు కచ్చితంగా మళ్లీ సభలోకి ప్రవేశించాలి. కాంగ్రెస్ మిమ్మల్ని నామినేట్ చేయకపోతే, మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయడానికి మేం సిద్ధమే. రాజ్యసభకు మీ అవసరం ఉంది అని అథావాలే ఆజాద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా గులాంనబీ ఆజాద్ వ్వవహరిస్తున్నారు. ఫిబ్రవరి 15తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది.













