అయోధ్య భూమిపూజకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం రేపు (5వ తేదీ) భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని బుధవారం ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక జెట్‌లో ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10:40కి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 11:30కి అయోధ్య చేరుకుంటారు. 11:40కి హనుమాన్‌గర్హి ఆలయంలో పూజలు చేస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పూరాతన ఆలయంలో ప్రధాని సందర్శన సందర్భంగా ప్రధాన పురోహితుడు మహంతి రాజుదాస్ సహా పలువురు అర్చకులు దేశంలో కరోనా తొలగిపోవాలంటూ వేదమంత్రాలు చదువనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్ చంద్రకాత్ సొంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభాశంకర్ సొంపుర సోమ్‌నాథ్ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్దతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూప ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.













