రాజస్థాన్‌లో కాంగ్రెస్ సీఎం మార్పు?.. ప్రియాంక గాంధీ సన్నిహితుడికి పదవి?
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన రాజస్థాన్ నేతలకు పెద్ద షాక్ తగలబోతోంది. వాళ్లంతా మద్దతు ఇచ్చిన అశోక్ గెహ్లాట్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట. ఈ పదవిలో ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నేత ఆచార్య ప్రమోద్ కృష్ణంను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, దానికి రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు కూడా మద్దతుగా నిలిచారని సమాచారం. శనివారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో కూడా ఆచార్య ప్రమోద్ భేటీ అయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆచార్య ప్రమోద్.. ‘రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, సీపీ జోషీతోపాటు ఎమ్మెల్యేలంతా అండగా ఉంటారు. ఇక నుంచి రాజస్థాన్‌లో ఏం జరిగినా అది కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉంటుంది’ అని తేల్చిచెప్పారు.













