అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ( ఏప్రిల్ 22) తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గత రెండు దశాబ్దాలుగా 12-తుగ్లక్ లేన్ బంగ్లాలో ఉంటున్న రాహుల్ ఇటీవల తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు తరలించారు. ఈ క్రమంలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ తన నివాసానికి వెళ్లారు. మిగతా వస్తువులను తీసుకుని బంగ్లా తాళాలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఇకపై రాహుల్ తన తల్లితో కలిసి జన్‌పథ్‌లో ఉండనున్నారు.













