మేం అధికారంలోకి వచ్చాక ఆ స్కీమ్‌ను రద్దు చేస్తాం
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ప్రియాంక గాంధీ రోడ్‌షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీ ఇచ్చినా తప్పకుండా నెరవేస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చామని తెలిపారు. ప్రజల బాగోగులు పట్టని బీజేపీని గద్దె దించాలని ఓటర్లకు ప్రియాంక పిలుపునిచ్చారు.













