కాన్వాయ్ ఆపి మరీ అంబులెన్సుకు దారిచ్చిన ప్రధాని మోదీ
కాన్వాయ్ ఆపి మరీ అంబులెన్సుకు దారిచ్చిన ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఆయన.. వెనకగా వస్తున్న అంబులెన్సును చూసి, దానికి దారిచ్చారు. అందుకోసం తన కాన్వయ్ మొత్తాన్ని రోడ్డుపక్కగా ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మోదీ కాన్వాయ్‌కు చెందిన ఎస్యూవీ వాహనాలన్నీ నెమ్మదిగా రోడ్డు పక్కకు వెళ్లి, అక్కడ ఆగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అవి ఆగిన కాసేపటికే ఒక అంబులెన్సు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ప్రధాని మోదీని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/i/status/1575783298344792066













