ఇది మామూలు ఘనత కాదు : మోదీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేద ప్రజల కోసం గడిచిన ఎనిమిదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సూరత్ నగరంలో మెగా మెడికల్ క్యాంపును వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ.. ఒక్క గుజరాత్‌లోనే 10 లక్షల ఇళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు కుళాయి నీళ్లు అందుతున్నాయన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు రూ.2లక్షల కోట్లను దేశవ్యాప్తగా ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశామన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగడం మామూలు ఘనత కాదని అన్నారు.













