ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్
మధ్యప్రదేశ్‌లోని రేవాలో 750 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇది. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్దది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. శుద్ధ ఇంధనరంగంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌గా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్ శుద్ధ, చౌక అయిన విద్యుత్‌కు హబ్‌గా మారనుందన్నారు. ప్రపంచంలో సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న టాప్ 5 దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని తెలిపారు. ఆత్మనిర్భర్ లో విద్యుత్ స్వావలంబన కూడా ఒకటని, దానిని సౌరశక్తి ద్వారా సాధించవచ్చన్నారు.













