టైమ్ మ్యాగజీన్ జాబితాలో మోదీ, మమత బెనర్జీ, అదర్ పూనావాలా
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2021వ సంవత్సరానికి గాను ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి స్థానం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రిన్స్ హ్యారీ మేఘన్ మెర్కెల్ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ బరాదర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జవహర్లాల నెహ్రూ, ఇందిరా గాంధీ, తర్వాత మూడవ కీలకమైన నాయకుడు నరేంద్ర మోదీ అని టైమ్ పత్రిక ప్రొఫైల్లో పేర్కొంది.













