ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్
17వ లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిదే. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. మేలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం కావడం ఇదే చివరిసారి.













