పాక్ కు భారత్-అమెరికాల డిమాండ్
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్-అమెరికాలు డిమాండు చేశాయి. భారత్-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త కార్యాచరణ బృందం మూడో సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగాయి. అధికార్ల స్థాయిలో జరిగిన ఈ సమావేశాల అనంతరం ఇరుదేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తక్షణ, సుస్థిర, వెనకడుగు వేయని చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను డిమాండు చేశాయి. ముంబయి, పఠాన్‌కోట్ దాడులకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని కోరాయి. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. వివిధ ఉగ్రవాద సంస్థల వ్యవహారాలపై రెండు దేశాలూ చర్చించాయి.













