జీజేపీ ఎంపీకీ నాన్ బెయిలబుల్ వారంట్
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రామ్ శంకర్ కథేరియాకు కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో కోర్టుకు హాజరు కాలేదని ఎంపీపై కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఎంపీ కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు ఇందిర వర్మ, హైకోర్టు న్యాయవాదుల సంఘర్ష్ సమితి సీనియర్ నాయ్యవాది కెడి శర్మ, అరుణ్ సోలంకి, కున్వర్ శైలరాజ్ సింగ్ తదితరుల రైలును నిలిపిన కేసులో నిందితులుగా ఉన్నారు. 2009వ సంవత్సరంలో రైలు దిగ్బంధనలు కేసులో నేటికి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎంపీ రామ్ శంకర్‌కు కోర్టు ఎట్టకేలకు నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చింది. ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు బెంచ్ డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26వ తేదీన ఎంపీ రామ్ శంకర్ రైలును నిలిపివేశారు.













