పంచ్ ప్రభాకర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్.. భారత్ కు వచ్చినప్పుడు అదుపులోకి
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిన పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీబీఐ డైరెక్టర్ సుభోద్కుమార్ జైస్వాల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంటర్‌పోల్ జారీ చేసిన బ్లూ నోటీస్ ఆధారంగా పంచ్ ప్రభాకర్ అమెరికా న్యూజెర్సీలోని మాంట్‌విల్లీలో నివాసం ఉంటున్నట్టు ఎఫ్‌బీఐ ధ్రువీకరించిందన్నారు. దాని ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు సంబంధిత పరిధిలోని కోర్టు నుంచి ఈ నెల 8న నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నామని తెలిపారు. 9న ఇంటర్ పోల్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ప్రొవిజనల్ అరెస్ట్ రిక్వెస్ట్ పంపించామని తెలిపారు. ప్రభాకర్ భారత్‌కు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకొనేందుకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లుకైట్ నోటీసులు జారీ చేసిందన్నారు.













