సామాన్యులకు కేంద్రం మరో షాక్
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టం చేసింది. కొవిడ్ నేపథ్యంలో అన్ని రాయితీలనూ రద్దు చేసిన రైల్వే శాఖ కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కీలక ప్రకటన చేసింది. గతంలో కొనసాగించిన అన్ని రాయితీలను తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టికెట్ రాయితీ గురించిన అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాయితీల వల్ల రైల్వే శాఖపై మోయలేని భారం పడుతోందని పేర్కొన్నారు.













