అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఇవ్వలేదు… నిర్మలా సీతారామన్
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందని, అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆమె భువనేశ్వర్లో జరిగిన ఓ సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కల్పన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆర్థిక సంఘం మాత్రం ఎవరికీ వద్దని చెప్పింది అని ఆమె స్పష్టం చేశారు.













