ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు సిద్దం.. లాక్డౌన్ విధించే ప్రసక్తి లేదు
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, లాక్డౌన్ విధించే ప్రసక్తి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ భయపడాల్సిన పని లేదు. పరిస్థితులను నేను అనుక్షణం సమీక్షిస్తున్నాను. లాక్డౌన్ విధించే ఆలోచన లేదు. కానీ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మాస్క్ ధరించండి సామాజిక దూరం పాటించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ మనకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, జాగ్రత్తగా ఉంటే చాలు అని తెలిపారు.













