నీతీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. ఏ సమయంలోనైనా ముందస్తుగానే
సార్వత్రిక ఎన్నికలపై జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు ఏ సమయంలోనైనా ముందస్తుగానే జరగవచ్చని వ్యాఖ్యానించారు. వివపక్షాల ఐక్యత నేపథ్యంలో తమకు మరింత నష్టం జరుగుతుందని బీజేపీ భయపడుతోందని, అందువల్ల ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎన్డీయే ముందస్తుగానే లోక్సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఏడెనిమిది నెలల నుంచే చెబుతున్నానన్నారు. అందువల్ల అన్ని విపక్షాలు బీజేపీని ఓడించేందుకు కచ్చితంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం వెనుక తనకు ఎలాంటి పదవీకాంక్షలేదని మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు. ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని పార్టీలకు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడమే తన కోరిక అన్నారు.













