వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం… కొత్త మార్గదర్శకాలు
వర్క్ ఫ్రమ్ హోంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ల లో పని చేసేవారికి వారికి గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోం పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తం ఉద్యోగుల్లో గరిష్ఠంగా 50 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ రూల్స్, 2006 ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్ 43ఏ ని వాణిజ్య శాఖ ప్రకటించింది. పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, 50 శాతానికి మించి ఉద్యోగులు ఇంటి వద్ద పని చేయాలంటే సంబంధిత కారణాల్ని రాతపూర్వకంగా వివరిస్తూ సెజ్లను డెవలప్మెంట్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఐటీ, సెజ్ రంగాల్లోని కొన్ని కేటగిరిల ఉద్యోగులకు వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది.













