నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన ఐదో లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాను రెండు స్థానాల నుంచి బరిలోకి దిగినట్లు వెల్లడింరచారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలీ స్థానంతో పాటు బోలంగీర్ జిల్లాలోని కాంతాబంజీ నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగబోతున్నట్లు వెల్లడించారు.