ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష..
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) నిర్వహించేందుకు ‘జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని యువతకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు ప్రకాష్ జవదేకర్. ఎన్ఆర్ఏ వల్ల వృథా ఖర్చుల భారం తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి, నిరుద్యోగులకు అనవసర శ్రమ తగ్గిపోతుందని, సమయం కూడా కలిసి వస్తుందన్నారు.













