సీఎం కేజ్రీవాల్ పై సుప్రీం ప్యానల్ సంచలన వ్యాఖ్యలు… అదే పాపమా? అని స్పందించిన కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్యానల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ అవసరాన్ని 4 రేట్లు పెంచి చెప్పారని పేర్కొంది. ఏప్రిల్- మే మాసాల్లో ఢిల్లీలో సెకండ్ వేవ్ ప్రబలంగా ఉండేదని, ఆ సయమంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ అవసరాలను 4 రేట్లు పెంచేసి చేప్పిందని సుప్రీం ప్యానల్ తెలిపింది. ఢిల్లీకి అవసరానికి మించి ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో, ఇతర రాష్ట్రాలకు కొరత ఏర్పడిందని ప్యానల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రిలోని పడకల సంఖ్యకు, ఆక్సిజన్ డిమాండ్‌కు ఎక్కడా పొంతన లేదని పేర్కొంది. పడకల కెపాసిటీ ఆధారంగా లెక్కిస్తే, 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించినట్లు తేలిందని సుప్రీం ప్యానల్ తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది.
స్పందించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
సుప్రీం ప్యానల్ ఇచ్చిన మధ్యంతర నివేదికపై దుమ్ము దుమారం రేగుతోంది. కోవిడ్ సమయంలో ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ అవసరాలను 4 రేట్లు పెంచి చెప్పారని సుప్రీం ప్యానల్ పేర్కొంది. దీంతో బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన 2 కోట్ల మంది ప్రజల ప్రాణాల కోసం పోరాడడమే నేను చేసిన పెద్ద నేరం’’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ వాళ్లు ఎన్నికల ర్యాలీ్ల్లో ఉన్నప్పుడు తాను రాత్రింబగళ్లు కష్టపడి ఆక్సిజన్ అవసరాలను తీర్చినట్లు తెలిపారు. ఆక్సిజన్ కొరత కారణంగానే తమ తమ కుటుంబీకులను ప్రజలు కోల్పోయారని, దీనిపై రాజకీయాలు సరికాదని కేజ్రీవాల్ అన్నారు.