యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. 82 సంవత్సరాల వయసున్న ములాయం గత వారం రోజులుగా ఐసీయూలోనే ఉన్నారు. ములాయం మరణవార్తను ఆయన కుమారుడు, యూపీ మాజీ ముఖ్యమంత్ర అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ములాయం తన రాజకీయ ప్రస్థానంలో మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు. 1939 నవంబర్ 22న జన్మించిన ఆయన.. 1967లో యూపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు.













