కొవిడ్ నిబంధనలపై… కేంద్రం ప్రకటన

దేశంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలను జూన్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉందని కేంద్ర తెలిపింది. అందువల్ల కరోనా నియంత్ర చర్యలు ఖచ్చితంగా అమలు చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ఏదైనా సడలింపు తగిన సమయంలో, గ్రేడెడ్ పద్ధతిలో పరిగణించబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.