నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే గానీ… బెంగాల్ ను మాత్రం
బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నిక ఎన్నికలకు ముందు బీజేపీ ఏర్పాటు రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యతతో జీవిస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. కొన్నిసార్లు గూర్ఖాలాండ్, ఇంకొన్నిసార్లు నార్త్ బెంగాల్ అంటూ రెచ్చగొడుతోంది. నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే గానీ బెంగాల్‌ను మాత్రం విభజన కానివ్వను అని అన్నారు.













