కెనడా టూ కాశీకి అన్నపూర్ణ దేవి విగ్రహం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని కొలువై ఉండే అన్నపూర్ణదేవి విగ్రహం వందేళ్ల క్రితం చోరీ అయ్యింది. ఇటీవల కెనడాలో ఆ విగ్రహాన్ని గుర్తించారు. అయితే మాతా అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని ఇప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఢిల్లీ నుంచి కాశీ వరకు అన్నపూర్ణ విగ్రహంతో ర్యాలీ ప్రారంభించారు. 15వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అన్నపూర్ణదేవి విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి కేంద్రం అప్పగిస్తుందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. అన్నపూర్ణ విగ్రహాన్ని తొలుత ఢిల్లీ నుంచి అలీఘడ్కు తీసుకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి 12వ తేదీన కన్నౌజ్‌కు తరలిస్తారు. ఆ తర్వాత 14వ తేదీన అయోధ్యకు తీసుకువెళ్తారు. 15వ తేదీన కాశీ విశ్వనాథ ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అన్నపూర్ణాదేవి విగ్రహం ఎత్తు 17 సె.మీ. వెడులు 9 సెమీ ఉంది.













