పార్లమెంటు నూతన భవనం… ప్రారంభానికి ముహూర్తం ఖరారు
దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునికంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. పార్లమెంటు కొత్త భవనాన్ని ఆరంభించాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం వెల్లడించింది. నూతన పార్లమెంటు భవనంలో లోక్సభ ఛాంబర్లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్లో 300 మంది సౌకర్యవంతంగా ఆశీసులు కావొచ్చని తెలిపింది. పార్లమెంటు సంయుక్త సమావేశం జరిగితే లోక్సభ ఛాంబర్లోనే 128 మంది సభ్యులు కూర్చోవచ్చని వివరించింది.













