వారికి పార్లమెంట్ లోకి అనుమతి లేదు
కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై లోక్సభ సచివాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బంది ప్రవేశానికి సంబంధించి పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.2 తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని లోక్సభ సెక్రెటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ తెలిపారు. ఎంపీలతో పాటు వ్యక్తిగత సిబ్బంది పార్లమెంట్ పరిసరాల్లోకి రావడం వల్ల సమావేశాలు జరుగుతున్న సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కరోనా కేసులు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా భౌతిక దూరం పాటించాలనే నియమం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













