ఆ కేసులో లాలూ నిర్దోషి … 13 ఏళ్ల తర్వాత తీర్పు
కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్‌లోని పాలము కోర్టుకు లాలూ హాజరవగా, విచారణ అనంతరం కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే, ఆయనకు కోర్టు రూ.6వేల జరిమానా విధించింది. ఈ కేసులో లాలూకు విముక్తి లభించిందని, ఇకపై ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది ధీరేంద్ర కుమార్ తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్లిపోయారు.













