ఈ నెల 8న మిజోరం ముఖ్యమంత్రిగా…లాల్దుహోమా ప్రమాణం
జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లాల్దుహోమా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 27 నియోజకవర్గాల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 74 ఏండ్ల వయసున్న లాల్దుహోమా ఐపీఎస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.













