మా రాష్ట్రం కేరళ కాదు… కేరళం అని మార్చండి!
కేరళ పేరును కేరళం గా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కొత్త పేరును అధికారికంగా మార్పుచేయాలని ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోనూ అందుకు అనుగుణంగా మార్పు చేయాలని సూచించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆమోదించింది. అందులో ఎలాంటి సవరణ మార్పులు చేయాలని విపక్షాలు సూచించలేదు. అనంతరం స్పీకర్ ఏ.ఎన్.షంషీర్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.













