కేదార్నాథ్ ఆలయం మూసివేత
ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని సోమవారం మూసివేశారు. శీతాకాలం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8:30 గంటలకు మూసివేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్, తివేంద్రసింగ్ రావత్, దేవస్థానం బోర్డు సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి. ఆలయం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తోంది. హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్‌లో ఆదివారం నుంచి మంచు కురవడం ప్రారంభమైంది. అలాగే బ్రదీనాథ్ ఆలయం ప్రాంతంలోనూ మహిపాతం కురుస్తోంది. మంచు వర్షంలో ఆలయం ఎదుట భక్తులు సందడిగా గడిపారు.













