బీజేపీ తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్ కుమార్?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికకు బీజేపీ ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలి జాబితాను ప్రకటించనుంది. ఈ జాబితాలో కొత్త వ్యక్తులు, యువ నేతలకు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ ను బరిలో దించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలోనే వీరిద్దరు పేరు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అక్షయ్ కుమార్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనాను నిలబెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇటీవల కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీజేపీలో చేరితే స్వాగతిస్తామని గతంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ కూడా వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు.













