లోక్ సభ ఎన్నికల్లో మేం పోటీ చేయట్లేదు
తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైంది. తాజాగా ఈ కూటమిలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయం పార్టీ కూడా చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ సమావేశం అనంతరం కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడుతూ నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ ప్రయోజనాలను కాంక్షించి కూటమిలో చేరా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే` కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అని వెల్లడిరచారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరపున ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేయనుంది.













