వీరప్పన్ను మట్టుబెట్టిన విజయ్ కుమార్ రాజీనామా
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ హోం శాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని ఆయన నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. అక్కడి నుంచి తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నా బాధ్యతలను స్వస్తి చెప్పి, ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చాను అని మీడియా తెలిపారు. హోంశాఖ భద్రత సలహాదారుగా అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ హోంశాఖ మంతి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.













