బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు షాక్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ షాకిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుమన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంజీ కుమారుడే సంతోస్ సుమన్. అయితే హిందూస్తానీ అవం మోర్చా పార్టీని జేడీయూలో విలీనం చేయాలని ఒత్తిడి వచ్చినందుకే మంత్రి పదవికీ సంతోష్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపానని తెలిపారు. జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ కుమార్ చౌదరిని వ్యక్తిగతంగా కలిసి, రాజీనామాకు గల కారణాలను వివరించానని పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశాను. మహాఘటబంధన్ నుంచి తమ పార్టీ వైదొలగలేదని స్పష్టం చేశారు.













