విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం. తనకు తాను ఓ గని లీజుకు కేటాయించుకున్న నేపథ్యంలో సోరెన్‌పై లాభదాయక పదవి నిబంధనల కింద వేటు వేయాలని, ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ తన బలాన్ని నిరూపించుకున్నాడు.













