రాజ్యసభ ఎన్నికలు.. కేంద్ర మంత్రి జై శంకర్ నామినేషన్
రాజ్యసభ ఎన్నికలు వేళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ గుజరాత్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గాంధీనగర్‌లోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణీ రీటా మెహతాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తదితరులు ఉన్నారు. జులై 24న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ నెల 13తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 17 వరకు గడువు విధించారు. జై శంకర్ 2019లో తొలిసారి గుజరాత్ నుంచి రాజ్యసభ నామినేట్ అయిన విషయం తెలిసిందే. పదవీ కాలం ఆగస్టుతో ముగియనుండటంతో తాజాగా మరోసారి బీజేపీ నుంచి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు.













