భక్తులు లేకుండానే.. జగన్నాథ రథయాత్ర

వచ్చే నెలలో జరగనున్న పూరీలోని జగన్నాథ రథయాత్రకు ఈ ఏడాది కూడా భక్తులను అనుమతించడం లేదు. వరుసగా రెండో సంవత్సరం జనసందోహం లేకుండానే రథయాత్ర కొనసాగనుంది. కొవిడ్ నిబంధనల క్రమంలో భక్తులు లేకుండానే.. యాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ జెనా తెలిపారు. కేవలం ఆలయ అర్చకులు, కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే రథ యాత్ర సాగింది. ఉత్సవాల రోజున పట్టణంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. తొమ్మిదిరోజుల పండుగ షెడ్యూల్ ప్రకారం జూలై 12న జరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రథయాత్రను నిషేధించినట్లు చెప్పారు. రథాన్ని లాగేందుకు 500 మంది సేవలకును మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు రథయాత్రను వీక్షించవచ్చన్నారు.