ఐపిఎల్ వాయిదాతో బిసిసిఐకి నష్టం

కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల బోర్డుకు దాదాపు రూ.2,000 కోట్ల నష్టం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది భారతదేశంలో నిర్వహించే టీ 20 ప్రపంచ కప్‍కు కూడా ఇలాంటి ముప్పే పొంచి ఉన్నది. ఆతిథ్య హక్కులను భారతదేశం నుంచి ఇతర దేశాలు తీసుకుపోతే బీసీసీఐ మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్ ప్రస్తుతం వాయిదా పడటంతో బ్రాండ్ వాల్యూను కూడా ఘోరంగా కోల్పోయింది.