ప్రపంచంలోనే తొలిసారి…
భారతీయ రైల్వే శాఖ మరో అరుదైన ఘనత సాధించింది. మధ్యప్రదేశ్‌లోని బినా పట్టణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రైల్వే ఓవర్‌హెడ్ లైన్‌కు మళ్లించింది. అంటే ఈ కరెంటుతో రైళ్లు నడుస్తాయన్నమాట. రైళ్లు నడవడానికి సార విద్యుత్‌ను ఉపయోగించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. రైల్వేశాఖ, బీహెచ్ఈఎల్ సంయుక్త భాగస్వామ్యంతో రైల్వేశాఖ స్థలంలో 1.7 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి గోయెల్ చెప్పారు. ఇక్కడ ప్రతిఏటా 25 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. తద్వారా రైల్వేశాఖకు ఏటా రూ.1.37 కోట్ల మేర ఆదా అవుతుందన్నారు.













