దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా.. 9 వేలకు చేరువలో
బ్లాక్ ఫంగస్ దేశ ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర మంత్రి సదానంద గౌడ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కేటాయించామని తెలిపారు. గుజరాత్లో అత్యధికంగా 2,281 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రానికి 5,800 వయల్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో 2,000 కేసులు నమోదు కావడంలో 5,090 వయల్స్, ఆంధప్రదేశ్‌లో 910 కేసులు నమోదు కాగా 2,300 వయల్స్,, తెలంగాణలో 350 కేసులు నమోదు కాగా 890 వయల్స్ కేటాయించామన్నారు. ఢీల్లీలో 197 కేసులు నమోదు కాగా 670 వయల్స్ పంపామన్నారు. ఇక ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా, దీని బారినపడిన వారికి రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.













