మరో ఫ్రంట్ ఏర్పాటుకు శరద్ పవర్ ప్రయత్నం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో పడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రయోజన లేదన్న విషయాన్ని తెలుపుతూ, తమను ప్రజలు ఆదరించేలా కాంగ్రెస్, బీజేపీ లేకుండా మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తుందా ఎలా ఉంటుందోనని వ్యాఖలు వస్తున్నాయి. దేశంలో మూడో కూటమి అవసరాన్ని ప్రస్తావిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేని మూడో ఫ్రంట్ దేశంలో రావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే వివిధ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మూడో ఫ్రంట్ అవసరం ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా చెబుతున్నారని పవార్ తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని, ఆ ఫ్రంట్ కు పవార్ నేతత్వం వహిస్తారని ఎన్సీపీ వర్గాలు చెపుతున్నాయి. గతంలోనే కేసీఆర్తో పాటు పలువురు నాయకులు మూడవ ఫ్రంట్ ఏర్పాట్లకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరీ శరద్ పవార్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచార వస్తోంది. మరీ దేశంలో బీజేపీ, కాంగ్రేస్ లేని కూటమికి ప్రజలు అధికారన్ని కట్టబెడుతారో లేదా అని ఇప్పటి నుంచే రాజకీయ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.













