చైనాకు రష్యా ఝలక్…
చైనాకు మరో ఝలక్ తగిలింది. ఎస్-400 సర్పేస్టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్-400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జ్యాపం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్వాయిస్పై సంతకం చేసినంత సులువుగా ఆయుధాలను అందివ్వలేమని రష్యా తాజాగా వెల్లడించింది. ఎస్-400 మిసైళ్లను డెలవరీ చేయడం చాలా సంక్లిష్టమైన అంశమని, చైనా తమ సిబ్బందిని శిక్షణ కోసం పంపాలని, ఆ ఆయుధాలను వాడకంలోకి తీసుకురావాలంటే అనేక మంది టెక్నికల్ సిబ్బంది అవసరం వస్తుందని రష్యా చెప్పింది. ప్రస్తుతం కరోనా కాలం నెలకొన్నదని, ఈ సమయంలో ఎస్-400 మిస్సైళ్లను సరఫరా చేయడం వల్ల కరోనా మహమ్మారిపై పోరాటానికి విఘాతం ఏర్పడుతుందని రష్యా అభిప్రాయపడింది. పీఎల్ఏ దళాలను ఈ సమయంలో కష్టాల్లోకి నెట్టడం సరికాదన్నది.
ఎస్-400 క్షిపణుల సరఫరా నిలిపివేయడం డ్రాగన్ దేశానికి ఆందోళన కలిగించే అంశమే. వాస్తవానికి రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నా.. ఇటీవల హ్యాకింగ్ ఆరోపణలతో కొంత టెన్షన్ ఏర్పడింది. చైనా ఇంటెలిజెన్స్ అధికారులకు కొన్ని రహస్య పత్రాలను సెయింట్ పీటర్స్ బర్గ్ ఆర్కిటిక్ సొషియల్ సైన్సెస్ అకాడమీ అధ్యక్షుడు వాలెరీ మిట్కో చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సైళ్లను చైనాకు అప్పగించడంలో రష్యా జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.













