మోదీపై ప్రియాంక పోటీ చేస్తే తప్పక …సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని అన్నారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీకి పోటీగా బరిలో దిగితే ప్రియాంక తప్పక గెలుస్తారు. రాయ్‌బరేలీ, వారణాసి, అయేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని అని సంజయ్ వ్యాఖ్యానించారు.













