అరెస్టయినా మీరే మా ముఖ్యమంత్రి
లిక్కర్ స్కామ్ కేసులో ఒకవేళ అరెస్టయిన పక్షంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ అనంతరం మంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేలు కోరారని తెలిపారు. రానున్న రోజుల్లో అరెస్టయిన పక్షంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని తెలిపారు. కేంద్రంలో మోదీ సర్కారు కేజ్రీవాల్‌ను జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కు ఓటు వేశారని ఆయనతో తాము చెప్పినట్టు తెలిపారు. జైలులో కేబినెట్ సమావేశం నిర్వహించడానికి కోర్టు అనుమతిని తమ పార్టీ కోరుతుందని తెలిపారు. త్వరలో పార్టీ కౌన్సిలర్లతో కేజ్రీవాల్ సమావేశమవుతారని తెలిపారు.













