కమలం కండువా కప్పుకున్న హార్దిక్ పటేల్
పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ బీజేపీ పార్టీలో చేరారు. గుజరాత్లోని గాంధీ నగర్లో ఆ పార్టీ కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో హార్దిక్ కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. 2015లో పాటిదార్ ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది మే 18వ తేదీన ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.













