కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లకు బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్థాన్‌కు చెందినది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్ దాదాపు 86 లక్షల మంది సబ్‌స్కైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల సంఖ్య 102కు చేరుకున్నది.













