స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్ల కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలని, అవయవ దాతలు వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్ర తరపున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.













