కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులు ఇవే..
కొత్త ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 39,44,909 కోట్లతో కూడిన బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గతంలో కాగితాలకు పనిచెప్పకుండా డిజిటల్ తరహా బడ్జెట్ను ఈసారి ప్రవేశపెట్టారు. ఇందుకోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా యాప్ను రూపొందించి మొత్తం బడ్జెట్ వివరాలను ఇందులో పొందుపరిచారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలకు రూ.974 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ఫ్లో రేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్కు రూ.374.35 కోట్లు. హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖ పెట్రోల్ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.40 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.













